Rohit Sharma: క్యాచ్ మిస్..అక్షర్ కు రోహిత్ డిన్నర్ ఆఫర్ 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశన్ను మట్టికరిపించింది. అయితే, ఈ మ్యాచ్లో భారత బౌలర్ అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ అవకాశాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ చేజార్చాడు. దీనిపై మ్యాచ్ అనంతరం సారథి మాట్లాడుతూ "అది చాలా సులువైన క్యాచ్. దాన్ని నేను పట్టుకోవాల్సింది. అందుకోసం స్లిప్లో సిద్ధంగానే ఉన్నా. కానీ, అలా జరిగిపోయింది. అతడికి హ్యాట్రిక్ను దూరం చేసినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. బహుశా అతడిని డిన్నర్ కు తీసుకెళ్తానేమో.." అని రోహిత్ వ్యాఖ్యానించాడు.